HPCL | హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్‌లోకి భారీగా వరద.. నదిలో కొట్టుకుపోయిన 3 వేల గ్యాస్ సిలిండర్లు..!
HPCL | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల (LPG cylinders) ను అతిభద్రంగా దాచుకుంటున్నాం. సిలిండర్ అయిపోతే మళ్లీ ఎంత టైమ్ పడుతుందోనని ముందే బుక్‌చేసి అడ్వాన్స్‌గా నిండు సిలిండర్ పెట్టుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర (Maharastra) లో 3,000 గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
HPCL : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల (LPG cylinders) ను అతిభద్రంగా దాచుకుంటున్నాం. సిలిండర్ అయిపోతే మళ్లీ ఎంత టైమ్ పడుతుందోనని ముందే బుక్‌చేసి అడ్వాన్స్‌గా నిండు సిలిండర్ పెట్టుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర (Maharastra) లో 3,000 గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సిండిర్లు కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి.
మహారాష్ట్రలో కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయగఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ పాతాళ్‌గంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ప్లాంట్ గోడ కూలిపోవడంతో నదినీరు ప్లాంట్‌లోకి చొచ్చుకొని వచ్చింది. ఈ వరద ప్రవాహ తీవ్రతకు మూడు వేల వరకు సిలిండర్లు పాతాళగంగలో కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.
నదిలో కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితితో ఉన్నాయో లేదో చెప్పలేమని, అందువల్ల వాటిని తీసుకెళ్లడం ప్రమాదానికి దారితీయవచ్చునని కలెక్టర్ హెచ్చరించారు. నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన గ్యాస్ సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

