సిద్దిపేట : గజ్వేల్ రింగ్ రోడ్డు గుండా నిరంతరం వందల వాహనాలు తిరుగుతుంటాయి. అయితే ఆ దారిలో వెలుతురు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. కొన్ని స్తంభాలు వంగి విరిగిపడే విధంగా ఉన్నాయి.
వాటిని అలాగే వదిలిపెడితే ఏ క్షణంలోనైనా వాహనదారులపై పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా నిర్లక్యం వీడి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.