Durgamatha | రాయపోల్, సెప్టెంబర్ 27 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రం రాయపోల్‌లో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శనివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గ్రామాల్లోని అమ్మవారి దీక్షను యువకులు స్వీకరించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దంపతులు ప్రతి రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి