సిద్దిపేట,ఏప్రిల్ 24 : జిల్లా వైద్యాధికారి, గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ తడకమడ్ల మహేష్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన ఆకాల మరణం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..మహేష్ జిల్లా వైద్యాధికారిగా అందించిన సేవలు మరువలేనివన్నారు. జిల్లా మంచి డాక్టర్‌ను కోల్పోయిందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డా.మహేష్ ఆత్మకు శాంతి చేకురాలని భగవంతున్ని ప్రార్థించారు.