Doultabad Society | దౌల్తాబాద్, నవంబర్ 20 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూనియన్ భవనంలోని 72వ వారోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. దౌల్తాబాద్ సొసైటీ ఉత్తమ సొసైటీ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( పీఎసీఎస్) చైర్మన్గా 30 ఏళ్ల పాటు సేవలందించి విశేషంగా కృషిచేసిన అన్నారెడ్డిగారి వెంకట్ రెడ్డిని యూనియన్ ఎండీ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి అవార్డు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ అన్నారెడ్డిగారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీకి ఉత్తమ అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. 1995 నుండి నేటి వరకు అధ్యక్షుడిగా దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు సొసైటీ పాలకవర్గంతో కలిసి సొసైటీ అభ్యున్నతి కోసం కృషి చేశానని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో సొంత భవనాన్ని కూడా నిర్మించుకున్నామని అన్నారు.
Karnataka | కర్నాటకలో ‘నవంబర్ రెవల్యూషన్’.. ఢిల్లీలో శివకుమార్ క్యాంప్ ఎమ్మెల్యేల లాబీయింగ్..!
IDEAL Foundation | విద్యా సంస్థల అభివృద్ధికి ఐడీయల్ సంస్థ రూ. 10 లక్షలు వితరణ
Ramavaram : క్రీడా పోటీల నిర్వహణలో లోటు లేకుండా చూడాలి : జీఎం శాలెం రాజు