కొల్లాపూర్ : నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల,కళాశాలల పునర్నిర్మాణానికి ఐడీయల్ సంస్థ (IDEAL Foundation ) రూ. 10 లక్షలను ప్రకటించినట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ( Dharma Teja ) వెల్లడించారు.
రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ శాఖ మాజీ అధ్యక్షులు విసిరెడ్డి బాల కోటిరెడ్డి సహకారంతో రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టి జూపల్లి అరుణ్ పిలుపుమేరకు కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరాదేవి ప్రభుత్వ బాలుర కళాశాలను ప్రిన్సిపాల్ సుధీర్ , సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు.
పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని గంట్రావుపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ. 5 లక్షలు , కొల్లాపూర్ జూనియర్ కళాశాలకు రూ. 5 లక్షలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సత్వరం అవసరమయ్యే పనులకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు రవి, మధు, రత్నగిరి ఫౌండేషన్ సభ్యులు సాయిచరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.