Karnataka : కర్నాటకలో ‘నవంబర్ రెవల్యూషన్’ (November Revolution) మొదలైనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావడంతో ముందుగా అనుకున్నట్టే ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాలున్నాయి. సీఎం సిద్ధరామయ్య అదేమీ లేదని కొట్టిపారేస్తున్న వేళ.. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar) మద్దుతుపలుకుతున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో వాలిపోయారు. అధిష్ఠానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి శిశకుమార్ను సీఎం చేయాలని వీరు లాబీయింగ్ జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కర్నాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలిచ్చింది. వాటిలో ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన డీకే శివకుమార్ షేర్ చేసుకోవాలనేది ఒకటి. కానీ, తీరా కుర్చీలో కూర్చున్నాక సిద్ధరామయ్య (Siddaramiah) అధికార బదలాయింపు మాటే ఎత్తడం లేదు. ‘ఈమధ్య మీడియాలో నవంబర్ రివల్యూషన్ మొదలైంది, సీఎం మార్పు తథ్యమంటూ తరచూ వార్తా కథనాలు వచ్చాయి. అయినా సరే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల మద్దతు నాకే ఉంది’అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరోవైపు శివకూమార్ సైతం తాను పార్టీకి విధేయుడినని, క్రమశిక్షణగల సైనికుడిలా ఏ బాధ్యత అప్పగించినా నోరు మెదపనని చెబుతున్నారు.
EK CM SE SARKAR NEHI CHALTI…
AUR KARNATAKA MEIN CM HI FIX NEHI HO RAHA.•Siddaramaiah doesn’t want to leave the CM chair.
•DK Shivakumar desperately wants to become CM.
•Result? Governance is suffering.
•Congress is busy settling internal power battles instead of running… pic.twitter.com/uP2MiWRaEi
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) November 20, 2025
కానీ, ఆయన వర్గం మాత్రం శివకుమార్‌కు మద్దతుదారులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం మార్పు విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానంతో తేల్చుకునేందుకు శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. అందుకని పదుల సంఖ్యలో ఒక బృందం నవంబర్ 18, మంగళవారమే ఢిల్లీకి వెళ్లింది. ఈ టీమ్‌లోని ఎమ్మెల్యేలు గురువారం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు.
రేపు మరికొందరు హస్తినకు వెళ్లి.. అధిష్ఠానంతో మాట్లాడి తమ నేతను ముఖ్యమంత్రి చేసేందుకు అనుమతించాలనే కోరే అవకాశముంది. ఇదే అంశంపై మీరు ఢిల్లికి ఎందుకు వెళ్తున్నారు? అని ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. నేను బంగారం, వజ్రాలు అడగానికి ఢిల్లీకి వెళ్లలేదు. నేను శివకుమార్ కోసం వెళ్తున్నా అని ఇక్బాల్ హుస్సేన్ అనే ఎమ్మెల్యే చెప్పారు.
On change in CM in Karnataka-“Its in hands of Party High Command. No one can say what’s going in High Command.”
Kharge ji, aren’t ‘you’ President of CONgress which ‘should’ mean High Command? If not, then who’s High Command which acts in Undemocratic Authoritative manner? pic.twitter.com/XhdgZjukSf
— BhikuMhatre (@MumbaichaDon) June 30, 2025