మద్దూరు(ధూళిమిట్ట), జూలై01: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం కోసం గ్రామానికి చెందిన బీర్కూరి అభినయ్ రూ.50వేల విరాళాన్ని మంగళవారం దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. దేవాలయ నిర్మాణానికి పెద్దమొత్తంలో విరాళాన్ని అందించిన అభినయ్‌ను కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు బీర్కూరి నర్సింహులు, పాలకుర్తి సిద్దిరాములు, రాపెల్లి దామోదర్, బీర్కూరి నారాయణ, బండ ఉమాకర్, సత్యనారాయణ, కొండ రాజు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కాలేయ వైఫల్యం నిర్లక్ష్యం వద్దు.. దెబ్బతింటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
Genelia | ఈ వయస్సులోను ఇంత అందమా.. తట్టుకోలేకపోతున్నామంటున్న కుర్రాళ్లు
Sugar Mill | షుగర్ మిల్‌లోకి పోటెత్తిన వరద.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార