DMHO Dhanraj | రాయపోల్, సెప్టెంబర్ 3 : సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ ధనరాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల సరఫరా, సిబ్బంది హాజరు, శుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 14 ఏండ్ల బాలుడికి డెంగీ లక్షణాలు ఉన్నాయని తెలుపగా ఆ గ్రామాన్ని సందర్శించారు. బాలుడికి ఎలీసా పరీక్షలు నిర్వహించి డెంగీ లేదని నిర్ధారించారు. గ్రామంలో ప్రతీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శి పరమేశ్వర, ప్రజలకు సూచించారు. అలాగే తాగునీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.
అధికారులు లోపాలు ఉన్న చోట వాటిని తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు సమయానికి సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డా శ్రీకాంత్, డా మహారాజ్, సిబ్బంది శ్రీనివాస్, ప్రియాంక, వినోదకుమారి, ప్రవీణ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
RTC Buses | హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
MLA Malla Reddy | తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యం : ఎమ్మెల్యే మల్లారెడ్డి
Naxalites | 20 మంది మావోయిస్టులు లొంగుబాటు