మిరుదొడ్డి, మే 9 : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండం రాజమహేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నంట బాపురెడ్డి అన్నారు. శుక్రవారం కొండాపూర్ గ్రామానికి చెందిన బాధితులు భీమరి యాదగిరికి రూ.36 వేలు, బైండ్ల యాదమ్మకు రూ.23 వేలు చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఆనారోగ్యంతో బాధపడే బాధితులు వెంటనే సీఎం సహాయనిధికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, నరేశ్, రాజు, వివేక్, శ్రీకాంత్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.