దుబ్బాక, డిసెంబర్ 30 : దుబ్బాకలో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు ఉత్సవలాం జరిగాయి. కార్యక్రమాలకు మంత్రు లు, ప్రముఖుల రాకతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రులకు స్వాగతం పలుకుతూ..పట్టణంలో నలుదిక్కుల బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లతో దుబ్బాక పట్టణం గులాబీమయంగా మారిం ది. మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. దుబ్బా క పట్టణంతో పాటు మండలంలోని హబ్షీపూర్, పోతారం, రాజక్కపేట గ్రామాల్లో రూ. 30 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో 17.50 కోట్ల అభివృద్ధి పనులు, మరో రూ.12.50 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్ జెండావిష్కరణతో ప్రారంభం..
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక బస్టాండ్ సమీపంలో ఉదయం 10.30 గంటలకు బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ జెండావిష్కరించారు. అనంతరం మంత్రులకు స్వాగ తం పలికేందుకు మండలంలోని హబ్షీపూ ర్ వద్దకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ నే తలు, ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లారు.
ఉదయం 11.40 గంటలకు హబ్షీపూర్‌లో రూ.8కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగులను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
12 గంటలకు హబ్సీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక వరకు(5కి.మీ.) బీఆర్ఎస్ శ్రేణు లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ..జై కేసీఆ ర్.. జైజై బీఆర్ఎస్’ అంటూ నినాదాలతో మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
మధ్యాహ్నం 12.35 గంటలకు దుబ్బాకలో రూ.3.50 కోట్ల్లతో నిర్మించిన మోడల్ బస్టాండు భవనాన్ని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం నూతనంగా 2 తిరుపతి లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌లు, ఒకటి వేములవాడ ఎక్స్‌ప్రెస్‌ను మంత్రు లు ప్రారంభించారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు దుబ్బాక మండలం రాజక్కపేటలో రూ.12 కోట్లతో దుబ్బాక-ముస్తాబాద్ రోడ్డు విస్తరణ పనులకు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు.
మధ్యాహ్నం 1.40 గంటలకు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసీ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్పర్సన్ చింతల జ్యోతీకృష్ణ, వైస్ చైర్మన్ చెక్కపల్లి పద్మయ్యతో పాటు డైరెక్టర్లను మంత్రులు సన్మానించారు. సభకు వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు భోజన వసతి కల్పించారు.
సాయంత్రం 4 గంటలకు దుబ్బాక మం డ టలం పోతారంలో రూ.3.65 కోట్లతో నిర్మించిన 73 డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులతో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గృహప్రవేశం చేయించారు. అనంతరం రూ.1.20 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, రూ.45 లక్షలతో గోదాం, రూ.20 లక్షలతో పాఠశాలలో అదనపు తరగతులు, రూ.30 లక్షలతో రెడ్డి సంఘం భవననాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.