Medak | రాయపోల్, ఏప్రిల్ 04: గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ‘ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు’పై జరిగే రాష్ట్రస్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సభ పోస్టర్‌ను సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌పై కాల్పులు జరిపిన ఏప్రిల్ 6వ తేదీన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దినాన్ని గద్దర్ పునర్జన్మ దినంగా సైతం పాటిస్తారని పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి జరిగే ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.