Gas Rates | గజ్వేల్, ఏప్రిల్ 9 : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్, ప్లకార్డులతో ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ రూ.50,పెట్రోల్ డీజిల్పై రూ.2 పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం దారుణమన్నారు.
గ్యాస్ ధరల పెంపు వల్ల దేశవ్యాప్తంగా రూ.7000 కోట్ల భారం, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల రూ.35 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఉజ్వల గ్యాస్ పథకం లబ్ధిదారులకు సాధారణ వినియోగదారులతోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద భారం పడుతుందని అన్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి ఆ ఫలితాలను అందించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని, దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకుల ధరలు, వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ ధరలను 130.57 శాతం పెంచడంతోపాటు సబ్సిడీ కూడా తగ్గించుకుంటూ వచ్చిందన్నారు. కార్పొరేట్ల కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ వినియోగదారులపై కోట్ల రూపాయల భారం వేస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం గజ్వేల్ మండల కార్యదర్శి సందీటి రంగారెడ్డి, సీపీఎం నాయకులు బండ్ల స్వామి, మొగోల్ల రాజు, భాషయ్య, మరాఠీ ఐలయ్య, రాజులు, నర్సింలు, రమేష్, బిక్షపతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ