పటాన్చెరు, జూన్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయి విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో బడిబాటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తిర్చిదిద్దుతున్నామని తెలిపారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి పీపీ రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అఫ్జల్, హెడ్మాష్టర్ స్పందనాచౌదరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యూనిఫామ్‌లు పంపిణీ: ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి
నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు బుధవారం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌స్వరూప్ శెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, ఎంఈవో విశ్వనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయు లు మన్మద కిశోర్, రమేశ్ చౌహాన్, పండరిరెడ్డి, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండలపరిధిలోని కమలాపురం, జుబ్రాన్పల్లి గ్రామాల్లో విద్యార్థులకు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రపీకున్నీసా, తహసీల్దార్ గ్రేసీబాయి, నాయకులు రా యిని మధు, సురేందర్‌రెడ్డి, నారాయణగౌడ్, దాచ సంగమేశ్వర్, కుంట్ల రాములు, సంగయ్య, తదితరులున్నారు.