MLA Kotha Prabhakar Reddy | చేగుంట, మార్చి16 : తాము ప్రాజెక్టులు నిర్మించి, గోదావరి జలాలను తీసుకొస్తే.. వాటిని చెరువు, కుంటల్లోకి తీసుకెళ్లడానికి కనీసం కాలువలు కూడా నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నార్సింగి మండల కేంద్రంలో సబ్ స్టేషన్లో 8MVA పవర్ ట్రాన్స్ పార్మర్ బ్రేక్ డౌన్ కాగా ఆయన పరిశీలించారు. యాసంగిలో కరెంట్ సమస్యలు తలెత్తగానే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కరువు కాటకాలు, కరెంట్ కష్టాలు తీసుకొస్తుందన్నారు. రైతుల హితమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేయడం జరిగిందని, కాంగ్రెస్ హయాంలో రైతులకు కష్టాలే మొదలయ్యాయన్నారు.
ఎమ్మెల్యే చెప్పినా నీళ్లు విడుదల చేయడం లేదు..
తాను ఎమ్మెల్యేగా గెలువగానే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని ఏడాది కాలంగా మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నీళ్లు కావాలని రైతులు ఫోన్ చేస్తే నీళ్లు విడుదల చేయించడం జరిగిందని, నేడు ఎమ్మెల్యే చెప్పినా నీళ్లు విడుదల చేయని కాలం వొచ్చిందన్నారు..
కాలువలకు నీళ్లు విడుదల చేయాలని మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి, ప్రాజెక్ట్ ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లినా తగినన్ని నీళ్లు విడుదల చేయడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నేడు కొంత భాగం పంటలు పండుతున్నాయన్నారు..
మల్లన్న సాగర్‌లో నీళ్లున్నా పంటలకు అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిన పంటలకు బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా రైతుల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మైలారం బాబు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయగారి రాజిరెడ్డి, నాయకులు మల్లేషం గౌడ్, భూపతి, ఏడి ఆడివయ్య, ఏఈ గణేష్ తదితరులున్నారు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు