వర్గల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో విషాదం నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళ్తే.. గత రెండు నెలల క్రితం చిన్నారుల తండ్రి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు.
చిన్నారుల తల్లి కవితతో పాటు ఆమె తల్లి భరతమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే గురువారం తండ్రి వెల్దుర్తి మంజునాథ్ కూడా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. దీనితో ఇద్దరు చిన్నారులు నైనిక(13)అక్షయ్ (10) అనాథలయ్యారు. అమ్మానాన్నల కోసం చిన్నారుల ఆక్రందనలు పలువురిని కంటతడి పెట్టించాయి.