Thoguta Orphans | తొగుట మార్చి 18 : తల్లిదండ్రులు మృతి చెంది అనాధలుగా మిగిలిపోయిన పిల్లలను బాలల సంరక్షణ విభాగం దత్తత తీసుకొని ఆలన పాలన చూస్తుందని బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ నర్సింలు అన్నారు. ఇటీవలే తల్లిదండ్రులు కెమ్మసారం భాగ్యలక్ష్మి నాగరాజు మృతి చెందగా ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి.. చిన్నారులకు ఆర్కెపూడి రఘు ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల చదువుతో పాటు బాలల సంరక్షణ విభాగం చూసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ స్వామి తదితరులు పాల్గొన్నారు
మృతుల కుటుంబాలకు పోలీసుల చేయూత..
తోగుట మార్చి 18 : తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇటీవలే కెమ్మసారం భాగ్యలక్ష్మి నాగరాజు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. తల్లి దండ్రులను కోల్పోయి అనాథ లుగా మారిన నలుగురు పిల్లలను మంగళవారం తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా అనాధలుగా మారిన చిన్నారులకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్