One Country One Election | కొమురవెల్లి, మార్చి 20 : కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసేందుకు బిల్లు రూపొందించిందని.. ఈ బిల్లు వల్ల దేశ ప్రగతికి కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు బెజడి బీరప్ప, అసెంబ్లీ కన్వీనర్ దండాల లక్ష్మారెడ్డి అన్నారు.
ఇవాళ బీజేపీ మండల అధ్యక్షుడు బుర్గోజు నాగరాజు అధ్యక్షతన కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు బీరప్ప, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరుగా జరుగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఆర్థికంగా కూడా దేశ ప్రగతి కుంటుపడుతుందన్నారు.
కార్యకర్తలు ఈ బిల్లు ప్రాముఖ్యతను పోలింగ్ బూత్ ల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనగామ తిరుపతి గౌడ్, మండల కో కన్వీనర్ ఆకుల పాండు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, బిక్షపతిరెడ్డి, సిద్దిపేట జిల్లా గీత సేల్ కన్వీనర్ గనబోయిన శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కనకయ్య,ఉపాధ్యక్షులు బ్రమండలపల్లి బాబు ఈగ కనకయ్య, యువ మోర్చా అధ్యక్షుడు సనది కరుణాకర్, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు