రాయపోల్ ఆగస్టు 01 : దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామానికి చెందిన దేవుడి పెంటా రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotta Prabhakar Reddy) ఆదేశాల మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పేదలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న నిరుపేదలు, పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, షేర్ పల్లి బందారం మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, నాయకులు దుర్గేష్ ,జయరాం రెడ్డి నల్ల శ్రీనివాస్ చంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.