MLA Palla Rajeshwar Reddy | చేర్యాల, జూన్ 15 : ఎర్రవల్లి వ్యవసాయ క్ష్రేతంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలికి గాయాలవగా.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండలంలోని పోతిరెడ్డిపల్లి చిన్న శిరిడి క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేరిట గోత్రనామార్చన నిర్వహించడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకొని నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలని చిన్న శిరిడి క్షేత్రంలో సాయిబాబాను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం