సిద్దిపేట, మే 28: తెలంగాణ రాష్ట్రం ఎవరో బిచ్చమేస్తే వచ్చింది కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాల సాయిరాం అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై నిందలు వేయడం మాని పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. జూన్‌లోనే రైతుభరోసా సాయం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్‌లాల్, ఇర్షాద్ హుస్సేన్, మహిపాల్ గౌడ్, నరేందర్, బాబు జానీ, శ్రీనివాస్‌రెడ్డి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.