Farooq Hussain | రాయపోల్, సెప్టెంబర్ 06 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి నిత్యం ప్రజల కోసం పరితపించే మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ జన్మదిన వేడుకలను సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంజూరు మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పదవి ఉన్నా.. లేకున్నా కష్టసమయాల్లో పార్టీలకు పతీతంగా అందరిని కలుపుకొని పోయి పేదలకు సేవ చేస్తున్న ఘనత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌కే దక్కుతుందన్నారు. అప్పటి దొమ్మాట నియోజకవర్గం ఇప్పటి దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో షారుఖ్ హుస్సేన్‌కు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతీ పండుగలకు కుల మతాలకు అతీతంగా ఏదో ఒక రకంగా సేవ చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గణపతి, మల్లేశం, మహేష్, సుధాకర్, సన్నీ, మహేష్ పాల్గొన్నారు.
KTR | తెలంగాణ బాద్షా కేసీఆర్.. బీఆర్ఎస్ అధినేత పట్ల చెదరని అభిమానం
RS Praveen Kumar | అగాథంలోకి తెలంగాణ.. మేల్కొనండి రేవంత్ రెడ్డి గారూ..
Building collapse | భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.. శిథిలాల కింద పలువురు..!