నిజాంపేట, సెప్టెంబర్ 6: తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాద్షా కల్వకుంట చంద్రశేఖర రావు (KCR) పట్ల అభిమానం చెక్కుచెదరలేదు. మెదక్ జిల్లా నిజాంపేటలో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఓ యూత్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పాలనలో గడిచిన పదేండ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వర్ణిస్తూ పాడిన పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఏండ్లు గడిచినా కేసీఆర్ చేసిన పనులను ప్రజలు మరువలేరన్నది మరోసారి రుజువైంది.