Bhu Bharathi | చేగుంట, జూన్ 04 : గత కొంత కాలంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు పెండింగ్‌లో ఉన్న వాటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ పేర్కొన్నారు. చేగుంట మండలపరిధిలోని వల్భాపూర్‌లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మాట్లాడుతూ.. ఎక్కువ దరఖాస్తులు ప్రభుత్వ భూములు కొనుగోలుకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయని, నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు కొనుగోలు, అమ్మకాలు జరుగరాదని, ఇట్టి దరఖాస్తుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఒక రైతు కుటుంబ భూ వివాదాన్ని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కుటుంబసభ్యులతో రాజీయే మార్గం అని, లేని యెడల రెవెన్యూ శాఖ తరపున తాము ప్రయత్నం చేస్తామని, అలా కుదరని పక్షంలో సివిల్కోర్టును ఆశ్రయించాలని సూచించారు. రైతులు తమ భూముల సమస్యల కోసం అర్జీలను సమర్పించినట్లయితే వాటిని పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న,ఆర్ఐలు జై భారత్‌రెడ్డి, సంతోష్‌రావు, సర్వేయర్ రవీందర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి భూమేష్, పంచాయతీ కార్యదర్శి సువర్ణ, రెవెన్యూ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు