Sports School | రాయపోల్, జూన్ 14 : స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతి ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి శనివారం పేర్కొన్నారు. 2025 -2026 విద్యాసంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతిలో అడ్మిషన్ పొందుటకు 2024-25 విద్యాసంవత్సరంలో 3వ తరగతి పూర్తి చేసిన బాలబాలికలు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రతి స్కూల్లో నాలుగవ తరగతిలో బాలికలకు 20 సీట్లు, బాలురకు 20 సీట్ల చొప్పున ఉన్నట్లు తెలిపారు.
అర్హతలు:
దరఖాస్తుదారులు 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతుండాలి
పుట్టిన తేది 1.9.2016 నుండి 31.8.2017 వరకు ఉండాలని పేర్కొన్నారు.
దరఖాస్తు చేయువిధానం..
దరఖాస్తులు satgasc.telangana.gov.in అనే వెబ్ సైట్లో 15.6.2025 లోగా అప్లై చేయాలన్నారు సత్యనారాయణ రెడ్డి. ఆన్ లైన్ లో అప్లై చేసిన అప్లికేషన్ ఫారం ప్రింట్ అవుట్, ఆధార్ జిరాక్స్ కాపీ, రెండు పాస్ ఫొటోలు, 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుచున్నట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని 18.6.2025న ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ ఆవరణలో జరిగే మండల స్థాయి ఎంపిక పోటీలకు హాజరు కావాలన్నారు. మండల స్థాయి ఎంపిక కాబడిన బాల బాలికలు 27.6.2025 నుండి 30.6.2025 వరకు జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు.
జిల్లా స్థాయిలో ఎంపికైన బాల బాలికలు 8.7.2025 నుండి 12.7.2025 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన బాల బాలికలు స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందుతారని పేర్కొన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్