Alumni Help | చేర్యాల, జూన్ 15 : వారంతా కలిసి చదువుకున్నారు.. తమతోపాటు కలిసి చదువుకున్న తోటి స్నేహితుడు అనారోగ్యానికి గురి కావడంతో క్లాస్మేట్స్ అంతా చలించిపోయారు. తమవంతుగా స్నేహితుడికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తోటి మిత్రుడికి అందరూ కలిసి రూ.38 వేల రుపాయల ఆర్థిక సాయం అందించారు.
వివరాల్లోకి వెళితే.. చేర్యాల మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ 10వ తరగతికి చెందిన గాజుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనారోగ్యంతో బాధపడుతున్న గాజుల యాదగిరికి తమవంతుగా చేయూతనందించారు. గత కొన్ని మాసాల క్రితం అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న యాదగిరికి ఆదివారం ఇంటికెళ్లి ఆర్ధికసహాయం అందించారు.
అనారోగ్యానికి గురై పనులు చేసుకోలేని పరిస్ధితులో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తోటి స్నేహితునికి తమవంతుగా తోచిన సహాయం అందించడంతో గ్రామస్థులు, పలువురు 1989-90 బ్యాచ్ విద్యార్ధులను అభినందించారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం