Collector Manu Choudary | కొండపాక, కుకునూరు పల్లి, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టం- 2025తో భూ సమస్యల పరిష్కారం లభించబోతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి అన్నారు. ఇవాళ కుకునూరు పల్లి, కొండపాక మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మనూచౌదరి ముఖ్యతిథిగా హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో భూ సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకరావడం జరిగిందన్నారు. గతంలో ఎంతో మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతరులతో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకరావడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అన్ని ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు.
ఈ చట్టంతో కోర్టుల్లో ఉన్న 99 శాతం కేసులు జిల్లాల్లోనే పరిష్కారం అవుతాయన్నారు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూముల రిజిస్టేషన్ ఇందులో పొందుపర్చడం జరిగిందన్నారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి వచ్చేదని.. నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించందన్నారు. గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే రికార్డ్స్, పట్టాదారు, రైతు, ఇతర రికార్డులను కావాలని అప్లై చేసుకుంటే నిర్ణీత కాల వ్యవధిలో తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉందని తెలిపారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా