అక్కన్నపేట, ఫిబ్రవరి 10 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని సవాల్‌గా తీసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అక్కన్నపేట మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గెలిచిన నాడు ప్రజల్లోనే ఉన్నా.. ఓడినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్న.. సంతోషం వచ్చినప్పుడు నవ్వడం, బాధ కలిగినప్పుడు ఏడవడం తన మనస్తత్వం కాదు’ అని అన్నారు. తన ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ, కార్యకర్తల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పని చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం ఊపిరి ఉన్నంత వరకు సేవచేస్తా, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కార్యకర్తలే నా బలం, బలగమని, ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేసి అభ్యర్థి గెలుపులో భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్యా మంగ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, సీనియర్ నాయకులు మాలోతు బీలూనాయక్, కందుల రాంరెడ్డి, జిల్లెల గాల్‌రెడ్డి, లింగాల సాయన్న, మ్యాక నారాయణ, కాసర్ల అశోక్‌బాబు, వెల్ది శోభారాణి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరుశరాములు, చిట్యాల సంపత్, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.