మద్దూరు(ధూళిమిట్ట), మే04 : కేంద్ర ప్రభుత్వం జారీచేయనున్న రైతు గుర్తింపు కార్డు కోసం మండలంలోని రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ధూళిమిట్ట మండల వ్యవసాయ శాఖ అధికారి అఫ్రోజ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్నిధి కోసం ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాసుబుక్ నెంబర్, ఆధార్‌కార్డును, ఫోన్ నెంబర్‌కు లింక్ చేసుకోవాలన్నారు.
అయితే ఫోన్ నెంబర్ తమ ఆధార్‌కి లింక్ అయి ఉండాలన్నారు. రైతులు స్థానిక ఏఈవోల వద్ద గాని లేదా మీ సేవా కేంద్రాలలోగాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఒక వేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే పీఎం కిసాన్నిధి డబ్బులు పడవు అని తెలిపారు. జూన్ 6వ తేది వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Youtuber Anvesh | ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు
Mumaith Khan | ముమైత్ అన్ని కష్టాలు పడిందా.. ఆమె బ్రెయిన్లో 9 వైర్సా..!