రాయపోల్ జనవరి 13 : గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత లైన్ మెన్, హెల్పర్లకు, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని, రైతులు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారుల అనుమతి లేకుండా ట్రాన్స్ఫార్మర్లను ఎక్కవ వద్దని సూచించారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. లో వోల్టేజి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని గుర్తు చేశారు. లో వోల్టేజి సమస్య ఉంటే రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామన్నారు. రైతులు కూడా డీడీలు కట్టిన వెంటనే ట్రాన్స్ఫార్మ తో పాటు విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవికాలం వస్తునందున యాసంగిలో పంటలు ఎండిపోకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఇందుకు రైతులు కూడా సహకారం అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఏఈ శ్రీనివాసరావు రైతులకు సూచించారు