KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
KTR | బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న గజ్వేల్ఎమ్మార్వో అన్నదాతను అవహేళన చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | తమకు బ్రతుకుదెరువును ఇచ్చే వ్యవసాయ భూమి సమస్యను పరిష్కరించాలని తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతన్నను గజ్వేల్ ఎమ్మార్వో స్వామి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..? అని నవ్వుతూ మాట్లాడి హేళన చేసిన విషయం తెలిసిందే. సదరు రైతు నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే ఆ ఎమ్మార్వో అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెబుతున్న వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఈ వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓ బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఎమ్మార్వో అన్నదాతను అవహేళన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు అన్నం పెట్టే రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక తోటి మనిషి (రైతు) పట్ల ఆ అధికారి ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. వారికి మానసిక సమతుల్యత లోపించిందని చెప్పక తప్పడం లేదు. రైతు పట్ల ఎమ్మార్వో వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గు చేటు. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయమమన్నారు. ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్‌కు, ప్రభుత్వంలో పనిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఎలాంటి చిన్న చూపు ఉందో మరోసారి ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. ఓ రైతు ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి, తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే ఎమ్మార్వో అవహేళనగా నవ్వుతూ మాట్లాడుతూ తహసీల్దార్ స్వామి వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్వో వ్యవహారంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
— KTR (@KTRBRS) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- farmer
- Gajwel MRO
- KTR
- Siddipeta
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

