రాయపోల్, అక్టోబర్ 05 : రాయపోల్ మండలంలోని అనాజీపూర్ పెద్ద చెరువులో సోమవారం మధ్యాహ్నం స్నానం కోసం చెరువులోకి వెళ్లిన యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా పొలీసులు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభించలేదు. మంగళవారం ఎస్ఐ షేక్ మహబూబా, ట్రైనీ ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి గజ ఇతగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.
ముడు గంటల పాటు చెరువులో శవం కోసం గాలించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. రాయపోల్ గ్రామానికి చెందిన గూని ఆంజనేయలు (28) గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే వారి దగ్గరి బంధువు మృతి చెందడంతో చెరువు వద్దకు స్నానాలకు వెళ్లారు.
ప్రమాదవశాత్తు ఆంజనేయులు చెరువులో మునిగిపోయాడు. మృతుడు ఆంజనేయలుకు భర్య, కుమార్తె ఉన్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.