సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 12 : కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఆర్అండ్ఆర్ కాలనీ కాం ట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
భూమి, ఊరు, ఇండ్లను కోల్పో యి ఇంకా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. నష్టపరిహారం, ప్లాట్ల కేటాయిం పు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీల్లో గుడి, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పైప్‌లైన్, ఎలక్ట్రిసిటీ స్తంభాలు వీధిలైట్లు, వైకుంఠధామాలు, అంగన్వాడీ సెంటర్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో గజ్వేల్ ఆర్డీవో విజేందర్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, పంచాయతీరాజ్ ఆర్అండ్బీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.