నర్సాపూర్, జూలై 15: నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ముఖ్యమైన మాత్రలు, ఇంజక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు వంద పడకల దవాఖాన అయినప్పటికీ మందుల కోసం మాత్రం ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుంది. నొప్పి, ఎసీడిటీ వంటి ప్రాథమిక వ్యాధులకు కూడా మందులు లేకపోవడంతో సర్కార్ దవాఖాన దీనస్థితికి అద్దం పడుతున్నది. పాంటోప్రోజోల్ మాత్రలను ఎసీడిటీకి విరుగుడుగా వాడుతుంటారు. ఈ మాత్రలు సర్వసాధారణంగా చాలామందికి ఎక్కువగా అవసరం ఉంటాయి. కానీ నర్సాపూర్ సర్కార్ దవాఖానలో ఈ మాత్రలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రతిఒక్కరికీ తరచూ గాయాలు కావడం, కీళ్లు, కండరాల నొప్పులు, వాపు, ఇతర నొప్పులకు ప్రభుత్వ దవాఖానకు నిత్యం వస్తుంటారు. కానీ వీటిని నివారించే డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు దవాఖానలో లేకపోవడంతో రోగులు నానాఇబ్బందులు పడుతున్నారు. ఎసీడిటీని తగ్గించడానికి, అజీర్ణం, గుండెల్లో మంట తదితర వాటికి రానిటిడైన్ మాత్రను వాడుతారు. ఈ మాత్రలు కూడా ఎసీడిటీలో స్టాక్ లేకపోవడం గమనార్హం. సర్కార్ ఎసిడిటీలో రోగులకు వైద్యులు ప్రిస్కిప్షన్ రాస్తే అందులో నాలుగు గోలీలు ఉంటే, రెండు గోలీలు మాత్రమే ఫార్మసీలో లభిస్తున్నాయి. మిగతా మాత్రల కోసం రోగులు ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ప్రస్తు తం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ మందు లు నిల్వ ఉండకపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సర్కార్ ఎసిడిటీలో అన్ని రకాల మందులు నిల్వ ఉంచాలని రోగులు కోరుతున్నారు.
కొన్ని మాత్రలు ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదు. అవసరాన్ని బట్టి రోగులకు ఇబ్బంది లేకుండా బయట కొనుగోలు చేస్తున్నాం. మూడు నెలల నుంచి ఇండెంట్ పెడితే నాట్అవెలబుల్ అంటున్నారు. రాన్టాక్, పాంటాప్రోజోల్ అందుబాటులో లేవు. ప్రభుత్వం సప్లయ్ చేయడం లేదు. నిన్న ఆదివారం ఉండడంతో బయటి నుంచి తెప్పించలేకపోయాం. కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉం చుతాం. ఈ మాత్రలను సంగారెడ్డి నుంచి కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లిస్తున్నాం. అప్పుడప్పుడు డీఎంహెచ్‌వో నుంచి మందులు తీసుకొస్తున్నాం. రోగులకు ఇబ్బందులు కలుగకుండా మెడిసిన్లు అందుబాటులో ఉంచుతాం.
కడుపులో మంటగా ఉంటే సర్కారు దవాఖానకు వచ్చిన. డాక్టర్‌కు చూపించుకుంటే మం దుల చిట్టి రాసిండు. అది తీసుకొని మందులిచ్చే దగ్గరకు వస్తే మందులు లేవంటున్నారు. బయట కొనడానికి పైసల్ లేకనే కదా సర్కార్ దవాఖానకు వొస్తి ని…వీళ్లేమో లేవంటున్నారు. పైసలు పెట్టుకొని బయట కొనాల్సి వస్తుంది.