Farmer | శివ్వంపేట, మార్చి 16 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగు నీరందక అన్నదాతలు గోస పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ రైతు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకు సాగు నీరు కరువైపోయింది. శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.
షేక్ శరీఫోద్దిన్ తనకున్న ఎకరమున్నర పొలంలో వేసిన వరిపంట పొట్టదశకు చేరి నీటి తడులు లేక ఎండుముఖం పట్టింది. దీంతో వేసిన వరిపంటను ఎలాగైనా కాపాడుకోవాలని అప్పుచేసి మరీ ఇవాళ కొత్త బోరు వేయించాడు. గంగమ్మ కరుణిస్తుందేమోనన్న షేక్ శరీఫోద్దిన్ ఆశలు అడియాశలే అయ్యాయి. వేసిన బోరు నుంచి చుక్కనీరు రాకపోవడంతో ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.
పొట్టదశలో ఉన్న తన వరిపంటను ఎలా కాపాడుకొని గట్టేక్కాలో అర్థంకావడం లేదని బోరున విలపించారు షేక్ శరీఫోద్దిన్. తెలంగాణలో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో ఈ దృశ్యాలు మరోసారి కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు