సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెం డు నెలలు గడుస్తున్నా గురుకులాల సమస్యలపై సర్కారు దృష్టి సారించలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
గజ్వేల్, ఆగస్టు 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాఫూర్‌లో ఎస్సీ బాలుర, బాలి కలు, వర్గల్ మండలం చౌదర్పల్లి, కొండపా క మండల కేంద్రాల్లోని గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో వి ద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరగతులు ముగిసిన తర్వాత అవే గదుల్లో రాత్రి పడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఒకే గది లో 35 నుంచి 40మంది విద్యార్థులు రా త్రి సమయంలో పడుకోవడం ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరిగా సర్దుకుంటున్నా రు. అధికారులు సకాలంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, టెస్ట్ బుక్స్, దుస్తులు పం పిణీ చేసినా వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన అద్దె భవనంలో వర్గల్‌కు చెం దిన ఎస్సీ బాలుర పాఠశాల, కళాశాలను నడిపిస్తున్నారు. ఈ గురుకుల పాఠశాల కిటికీల అద్దాలు పగిలిపోవడంతో రాత్రి సమయంలో దోమలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గురుకుల పాఠశాల పక్క నే మురుగు చేరడంతో దోమలు అధికంగా ఉంటున్నాయి. భవనం వెనుకాల మురుగునీటి ప్రవాహంతో దుర్గంధమైన వాసన వెదజల్లుతున్నది. ఐదో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన సుమారు 500పైగా విద్యార్థులు ఉన్నారు.