కంది, నవంబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. కంది మండలం చిద్రుప్ప పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐదు జిల్లాలకు చెందిన 224 మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్‌కు గురువారం పాసింగ్ ఔట్, దీక్షాంత్ పరేడ్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్ సేఫీ ్టవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరి, ఎస్పీ చెన్నూరి రూపేశ్ హాజరై గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్‌శాఖకు మంచి పేరు తేవాలన్నారు. వంద శాతం ఫలితాలకు కృషి చేసిన డీటీసీ ప్రిన్సిపాల్, టీచింగ్ స్టాప్‌ను అభినందిచారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి డీఐజీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ్‌రావు, డీటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.