హుస్నాబాద్‌టౌన్, మార్చి 10: దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్కరించుకుని హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల కోసం అనేక పాఠశాలలను ప్రారంభించిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. నేటి సమాజంలోని మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించేందుకు కృషిచేయాలన్నారు. మిత్రమండలి ఆధ్వర్యంలో సావిత్రిబాయిఫూలే విగ్రహాన్ని ఏర్పాటుచేసి నేటితరానికి ఆమె గొప్పతనాన్ని తెలియజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి 87 ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, పెరుమాండ్ల శ్రీనివాస్‌గౌడ్, చిత్తారి శ్రీనివాస్, కానుగుల మోహన్, గుండోజు రాజేంద్రప్రసాద్, బి. మహేందర్, ఉపాధ్యాయుడు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
గజ్వేల్, మార్చి 10: మండల పరిధిలోని కొడకండ్లలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ సర్పంచ్ భూమయ్య, కరుణాకర్, గిరిబాబు, ముఖేష్, ప్రవీణ్, బాలచంద్రం, భాను, సుధాకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.
గజ్వేల్, మార్చి 10: మండలంలోని అనంతరావుపల్లిలో డీబీఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్కరించుకొని ఆమే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎగొండస్వామి మాట్లాడారు.కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
హుస్నాబాద్, మార్చి 10: హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని సావిత్రిబాయిఫూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమె వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ మాట్లాడారు. బీఎస్పీ జిల్లా కార్యదర్శి శంకర్, నా యకులు వేల్పుల రాజు, శరత్ పాల్గొన్నారు.
బెజ్జంకి, మార్చి 10: మండల కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ నెటవర్క్ జిల్లా అధ్యక్షుడు ఉప్పులేటి బాబు, సం తోష్, కవ్వంపల్లి జీవన్, బోనగిరి జాన్, రత్నం, పవన్, లింగయ్య పాల్గొన్నారు.