Sarpanch | నిజాంపేట, ఫిబ్రవరి 9: నిజాంపేట మండలంలోని రజకపల్లి సర్పంచ్ వొజ్జ కనకరాజు సరికొత్త ఆలోచన చేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్ కనకరాజు కాసింపూర్ గ్రామంలో పుట్టిన ఆడపిల్లకు కిట్టుతోపాటు రూ. 5000ను అందజేశారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో సమానమనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ కనకరాజు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్ కనకరాజును గ్రామస్తులు అభినందించారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.