Pratima Singh | పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
Pratima Sing | సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
Pratima Singh | పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో మొదటి రోజున సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల వంట గదులు, పరిసరాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యతపై అవగాహన కింద సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు , పారిశుద్ధ్యం మధ్యాహ్న భోజన పథకం అమలు విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా తనిఖీ చేశారు. వంట విధానం, వంట తయారీ ప్రక్రియను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో సరైన ప్రమాణాలతో ఉండాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
అదే విధంగా పాఠశాలలో చేపట్టిన మూత్రశాలలను పరిశీలించి, మరుగుదొడ్లకు డోర్ల మరమ్మత్తుల పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత ఉపాధ్యాయులు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Pratima Singh1
Read Also :
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

