Sanitation | మెదక్ రూరల్, అక్టోబర్ 26 : హవేలీ ఘన్పూర్ మండలంలోని కొన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. మురికి కాలువలు తీయడం లేదని.. దీంతో రాత్రి అయిందంటే దోమలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ రోజు చెత్త బండి ట్రాక్టర్ గల్లీగల్లీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సింది పోయి, నిధులు ప్రభుత్వం నుండి రావడం లేదని.. ట్రాక్టర్లనూ గ్రామాలలో ప్రతీ రోజు నడిపించకుండా.. మూడు రోజులు లేదా వారం రోజులకు ఒకసారి నడిపించడం జరుగుతుందన్నారు.
కొన్నిచోట్ల గ్రామాలలో ట్రాక్టర్లను మూలకు వేశారని.. వాటర్ ట్యాంకర్ కూడా వినియోగంలోకి తీసుకురావడంలేదని.. దీంతో గ్రామంలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయన్నారు. పలుమార్లు ఈ విషయాలను సంబంధిత మండల అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Santation3

Brama Panchayat

Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్