Additional SP Chaitanya Reddy | మునిపల్లి, జూన్ 06 : మహిళలు అధైర్య పడకుండా అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. శనివారం మండల కేంద్రమైన మునిపల్లిలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అధైర్య పడకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ప్రత్యేకంగా సూచించారు. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ లేదని.. మహిళలు ముందుగా ఓ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం చేరుకునే విధంగా ముందుకు ఎలా వెళ్లాలో వారిని ఉత్సాహపరిచే విధంగా వివరించారు. అదే విధంగా మహిళలు సైబర్ నేరాల వల్ల ఇబ్బందులకు గురి కావొద్దు అన్నారు.
డిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మహిళా చట్టలపై వారికి ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి సర్పంచ్ సౌందర్యనరేందర్ గౌడ్, మండల అధికారులు, కొండాపూర్ సీఐ సుమన్ కుమార్,మునిపల్లి ఎస్సై రాజేష్ నాయకులు పాల్గొన్నారు.
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర