మునిపల్లి, ఫిబ్రవరి 18: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లిలో వేసవి రాకముందే తాగు నీటి కష్టాలు (Drinking Water) మొదలయ్యాయి. గత ఆరునెలలుగా గ్రామంలోని దళిత వాడలో తాగునీటి సమస్య ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మహిళలు ఖాలీబిందెలతో నిరసనకు దిగారు. తాగు నీటి సమస్యను పరిష్కరించాలని ఇటీవల నిర్వహించిన గ్రామ సభ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళిత వాడ మిసన్ భగీరథ పైప్ లైన్ కట్
మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో గత ఆరు నెలల నుంచి తాగు నీటి సమస్య ఉన్నట్లు సంబందితా పంచాయతీ కార్యదర్శి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఖమ్మంపల్లిలో దళిత వాడకు వచ్చే మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను కావాలనే కట్ చేశారని పంచాయతీ కార్యదర్శి తిరుపై మహిళలు మండిపడుతున్నారు. ఖమ్మంపల్లిలో ఏర్పడ్డ తాగు నీటి సమస్యను పరిష్కారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గ్రామంలో మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించినా స్పందించడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రెస్పాండ్ అవుతారన్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.