పటాన్చెరు, సెప్టెంబర్ 10 : పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ – 3 సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని గుర్తు తెలియని యువతి మృతి చెందిందన్నారు.
అర్ధ రాత్రి సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో మహిళ మరణించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినచో పటాన్ చెరు పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.