Wife | పటాన్ చెరు, నవంబర్ 1 : భార్యాభర్తల మధ్య గొడవ జరిగి కర్రతో భార్యను కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడక్ పల్లిలో వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన భర్త విషయం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, అమీన్పూర్ సీ నరేశ్ చేరుకొని హత్య కు సంబంధించిన వివరాలు సేకరించారు.
మృతురాలు బానోత్ సరోజ (46)ను భర్త రాజు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం త్రియంబక్‌పేట్ గండి తండా గ్రామానికి చెందిన మృతురాలికి 2005 సంవత్సరంలో భర్త బానోతు రాజు (48)తో వివాహమైంది. మృతురాలికి బానోత్ వినోద (18), బానోత్ విశాల్ (16) ఇద్దరు సంతానం ఉన్నారు. గత ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం బీరంగూడకు వచ్చి కూలీ పని చేసుకుంటూ నివసిస్తున్నారు.
ఈ నెల 25వ తేదీ వడకపల్లి గ్రామ శివారులో గల గంగుల రామిరెడ్డి పౌల్ట్రీఫామ్‌లో పనిచేయుటకు చెరుకూరి ప్రసాద్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో బడాయికి తీసుకోని వ్యవసాయం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భర్త భానోత్ రాజు మృతురాలు బానోత్ సరోజతో గొడవపడి కర్రతో కొట్టగా తీవ్ర గాయాలు సంఘటన స్థలంలో మృతి చెందిందన్నారు.
గతంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో భర్త, భార్యను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
