Bypass Road | కంగ్టి, జూన్ 15 : కంగ్టి పట్టణానికి పిట్లం రోడ్డు వైపు నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లేందుకు గత ప్రభుత్వం బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసింది. సుమారు కిలోమీటర్ మేర డబుల్‌రోడ్డు ఉండగా గత సర్కార్ రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేసింది. రోడ్డు గుండా కేవలం మట్టి వేసి వదిలేయడంతో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఇలాగే ఉండటంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ భూములు కొనుగోలు చేసి మట్టిరోడ్డు వేసి ఐదు సంవత్సరాలు కావస్తున్నా అధికారులు రోడ్డును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నారు. గత సర్కార్ సైతం ఇదే మాదిరిగా వదిలేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంభిస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రతీ రోజు బైపాస్ గుండా వందల సంఖ్యలో వాహనాలు తరులుతున్నాయని చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డు పూర్తిగా బురదమయంగా తయారైందని, రాత్రి వేళలో ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బైపాస్‌రోడ్డుకు బీటీ వేయాలని కోరుతున్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం