Mettukumar Yadav | పటాన్ చెరు, సెప్టెంబర్ 17 : మహిళా శిశు సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్థ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య మహిళ శక్తి వంతమైన కుటుంబ కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు.
మహిళలు, శిశువుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. మహిళలు , చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, వైద్య సేవలు, మందుల పంపిణీ, ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలోని మహిళలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేత్రావతి గారు, స్టాఫ్ నర్స్ యశోద గారు,హంసరాని, కవిత, నుస్రత్, అపర్ణ, పుష్పలత, సునీత తదితరులు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల