BRS Leaders | పటాన్చెరు, జూన్ 9 : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకావడంతో పటాన్చెరుకు చెందిన బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సోమవారం హైదరాబాద్లోని కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా బీఆర్కే భవన్లో కమిషన్ ఎదుట హాజరయ్యారు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరైన సమయంలో బీఆర్కే భవన్ వద్ద నిరసన తెలిపారు. విచారణను ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారంగా వాడుతున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రాభివృద్ధికి ఒక నిదర్శనమని, దీనిని రాజకీయ లబ్ధికోసం తప్పుదోవ పట్టించరాదని వారు డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య మార్గాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. నిరసనలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి రెడ్డి, జిన్నారం మండలం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, యూత్ నాయకులు పృథ్వీరాజ్, భారతి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బూన్, జగన్నాథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..