Fertilizers | జహీరాబాద్, జూన్ 23 : జహీరాబాద్ పట్టణంలోని మండలం కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను మంగళవారం మండల వ్యవసాయ అధికారి లావణ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక దుకాణంలో విక్రయిస్తున్న ఎరువులను ఆమె పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయించాలని ఆదేశించారు.
రైతులకు రశీదు తప్పకుండా ఇవ్వాలన్నారు. నాణ్యతలేని ఎరువులను విక్రయిస్తే కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతీ దుకాణాలలో స్టాక్ బోర్డు పట్టిక, ప్రైస్ బోర్డు దుకాణం ఎదుట ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతీ రశీదుపైన క్రిమి సంహారక మందులు తీసుకున్న రైతు సంతకం తీసుకోవాలన్నారు.
దుకాణంలో విక్రయిస్తున్న ఎరువుల నాణ్యతను పరిశీలించేందుకు శాంపుల్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆమెతోపాటు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన