Orphan | నిజాంపేట్, జూలై 6 : తనకు కాళ్లు చేతులు అన్నీ ఉండి యవ్వనంలో ఉన్న సమయంలో అందరూ కుటుంబీకులు తోడుగా ఉన్నారు. తన భార్య గత పది సంవత్సరాల క్రితం మరణించగా తాను ఏకాకి అయ్యాడు. ప్రస్తుతం తన జీవితం 161 జాతీయ రహదారి ఫ్లైఓవర్ కిందనే సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్ గ్రామానికి చెందిన వడ్డే అన్మయ అనే వ్యక్తి గతంలో అందరూ ఉన్న సమయంలో తనకున్న ముగ్గురు కూతుర్లతో ఆనందంగా గడిపినప్పటికీ గత పది సంవత్సరాల క్రితం వరకు కూతుళ్ల పెళ్లిళ్లు అన్ని అయిన తరువాత తన భార్య మరణించడంతో తాను ఎవరు లేని అనాధగా మిగిలిపోయారు.
తన సోదరులు ఉన్నా ఎవరు తన వైపు చూడలేకున్నారు. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నా కూతుళ్లు అన్నదమ్ములు ఎవరూ తన వైపు చూడడం లేదంటూ బోరున విలపిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం తన కాళ్లు వాతంతో పడిపోవడం వలన తాను కదలలేక ఉన్నాడు. తనకు ఇల్లు భూమి ఎలాంటివి లేకపోవడంతో ఎవరు తనను చూడడం లేదని వాపోతున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం నుండి నిజాంపేట్ కూడలిలో సెటర్ల వద్ద సంవత్సరంపాటు ఉన్నప్పటికీ వర్షాకాలం సమీపిస్తుండటంతో కొందరు తనను తీసుకువచ్చి 161 జాతీయ రహదారి ఫ్లైఓవర్ క్రింద ఉంచగా ఇక్కడే నా శేష జీవితాన్ని గడపాల్సి వస్తుందన్నారు.
ప్రస్తుతం నాకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌తో ఎవరైనా ఇచ్చిన దక్షిణతో పూట గడుస్తుందని వాపోతున్నాడు. అటుగా ప్రయాణిస్తున్న వ్యక్తులు చూసి ఏదో ఒకటి తినడానికి అందియడంతో కాలం వెళ్లదీస్తున్నానని ఆయన బోరున వినిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా అతనికి కాళ్లు పనిచేయకపోవడంతో ఎటు కదలలేకుండా ఉన్నచోటే ఉండిపోవాల్సి వస్తుంది.. అని బోరున కంటతడి పెట్టుకొని విలపిస్తున్నాడు తనను అధికారులు దృష్టి సారించి సురక్షితమైన ఓల్డ్ ఏజ్ హోంలో చేర్పించే విధంగా చూడాలని అటుగా ప్రయాణిస్తున్నవారిని కోరుకుంటున్నాడు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు